హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మూతబడిన బ్యాంకులు

W.G: తణుకులో యు.ఎఫ్.బి.యు పిలుపుమేరకు శుక్రవారం దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు మద్దతు తెలిపారు. న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెతో బ్యాంకులు మూతపడ్డాయి. ఏఐటీయూసీ, సిఐటియు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, వివక్షపూరిత పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ఉపసంహరణ కోరారు.