హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తికొండలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

KRNL: పత్తికొండలో బ్యాంకు ఉద్యోగులు రమ్య కుమారి, కిశోర్, ప్రసన్న ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 రోజుల పని దినాలు కల్పించి, 12వ ద్వైపాక్షిక ఒప్పందానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి, ప్రభుత్వ సాచివేత ధోరణి, కాలయాపన విడనాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ‌ఉద్యోగులు పాల్గొన్నారు.