హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం

ASR: వినాయక చవితి ఉత్సవాలకు డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మండల కేంద్రంతో పాటు సంతవలస వీధిలో వినాయక మండపాల ఏర్పాట్లను కమిటీ సభ్యులు వేగవంతం చేశారు. మండపాల నిర్మాణం, విద్యుత్‌ అలంకరణ తదితర పనులను నిర్వాహకులు చేపడుతున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.