ATP: ఉరవకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం విచారం వ్యక్తం చేశారు. వజ్రకరూరుకు చెందిన జైనుల్లా, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంపై మంత్రి పయ్యావుల దిగ్భ్రాంతి


