SKLM: ఎచ్చెర్ల మండలం సెగిడిపేటలో నూతన సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఇవాళ ప్రారంభించారు. మండల పరిషత్ జనరల్ ఫండ్ రూ.4 లక్షలతో వీటిని నిర్మించారు. గత ఐదేళ్లలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో గ్రామాలకు నిధులు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బెండు రామారావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్లను ప్రారంభించిన MPP


