హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొయ్యూరులో ముసురు వాతావరణం

ASR: కొయ్యూరు మండలంలో ముసురు వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచి మండలంలోని పలు చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మండలంలో సుమారు నెల రోజులుగా వర్షం జాడ లేదు. ఎండ తీవ్రంగా కాస్తుంది. దీంతో పలువురు రైతులు వరి నాట్లు వేయలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం అపరాలు సాగు చేస్తున్న రైతులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. భారీ వర్షం కురవాలని పలువురు కోరుకుంటున్నారు.