హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జువెలరీ షాపులో బంగారం చోరీ

W.G: నరసాపురం పట్టణంలోని ఓ జువెలరీ షాపులో 405 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ.52.65 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. షాపులో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి షేక్‌ లాల్‌పై యజమాని అనుమానం వ్యక్తం చేయగా, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నరసాపురం టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.