MNCL: రసాయన ఎరువులతో భూసారం తగ్గే ప్రమాదం ఉందని జన్నారం ఏఈఓ అక్రమ్ అన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయం మిషన్‌లో భాగంగా లింగయ్యపల్లెలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన, క్షేత్ర సందర్శన నిర్వహించారు. పంటల మేలు కోసం సహజ ఎరువులను వాడాలని, భూసారం పెంచేందుకు దృష్టి పెట్టాలని రైతులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కృషి సఖిలు జక్కుల రజిత, అంజలి, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
'రసాయన ఎరువులతో భూసారం తగ్గే ప్రమాదం'


