హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికులు ఐక్యంగా పోరాడాలి: AITUC

నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి భవన్‌లో గురువారం AITUC జిల్లా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సీనియర్ నాయకులు కొర్రపాటి ఆంజనేయులు జెండా ఆవిష్కరించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య తరగతులను ప్రారంభించారు. కార్మిక వ్యతిరేక విధానాలు, పెరుగుతున్న ధరలు, 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.