హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లపూడిలో అపార్ట్‌మెంట్‌పై పిడుగు

NTR: గొల్లపూడిలోని ఓ అపార్ట్‌మెంట్‌పై గురువారం సాయంత్రం పిడుగుపడింది. భవనం పైభాగంలోని గోడ కూలి, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపడటంతో స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.