హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలకు మరమ్మతులు చేయించిన ట్రాఫిక్ సీఐ

HNK: హన్మకొండ పట్టణంలో ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా మారిన గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన చొరవతో పూడ్చివేయించారు. గత పది రోజుల్లో గుంతల కారణంగా మూడు ప్రమాదాలు జరిగి పలువురు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో సీఐ సిబ్బందితో కలిసి మూడు భారీ గుంతలను ఆర్‌ఎంసీ కాంక్రీట్‌తో అత్యవసరంగా మరమ్మతులు చేయించారు.