హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నాళ్లీ.. 'నడక' యాతన!

PPM: భామినిమండలం డోకులగూడ ఆదివాసీ గిరిజనుల రహదారి కష్టాలు దశాబ్దాలుగా తీరడం లేదు. ఏబీ రోడ్డు నుంచి డోకులగూడకు వెళ్లే మార్గం రాళ్లు తేలి నడక యాతన తప్పడం లేదు. గిరిజనులు రేషన్ తీసుకువెళ్లాలన్నా.. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా.. సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన రాళ్లు తేలిన రహదారిపై నడవా ల్సిందే. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.