హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతి వెళ్లిన జిల్లా ఎస్పీలు

ATP: అమరావతి వెళ్లిన అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఎస్పీలు జగదీశ్, సతీశ్ కుమార్ సీఎం చంద్రబాబుతో ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నారు. జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థ తీరు తెన్నులపై ప్రధానంగా చర్చించనున్నారు. నేరాల నియంత్రణ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించనున్నారు.