VZM: చిన్న శ్రీనును తామే టీడీపీలోకి పంపామని, త్వరలో తామూ ఆ పార్టీలో చేరతామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బొత్స అనూష స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానన్నారు. తనను ఇంకా చిన్నపిల్లగా కొందరు భావిస్తున్నారని, కానీ తనకు 40 ఏళ్ల వయసు వచ్చిందని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆ ప్రచారాన్ని నమ్మొద్దు'


