హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భద్రకాళి రూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారేమ్మ శుక్రవారం అమావాస్య పూజలను అందుకుని భద్రకాళి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. వేకువజామునే అమ్మవారిని అర్చకులు అభిషేకించారు. తర్వాత కాటుక, కుంకుమ, వేపాకు, వివిధ పుష్పాలతో భద్రకాళి రూపంలో మారెమ్మను అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి నిమ్మకాయలను ఆలయ అధికారులు పంపిణీ చేశారు.