హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల ర్యాలీ!

KRNL: రాయలసీమ ప్రజల ప్రయోజనాల కోసం కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాదులు గత 20 రోజులుగా కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. తాత్కాలిక సర్క్యూట్ బెంచ్ తమకు వద్దని, శాశ్వత బెంచ్ ఇచ్చే వరకు ఆందోళనలు ఆపబోమని స్పష్టం చేశారు.