హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP, TDPలపై మాజీ ఎంపీ విమర్శలు

E.G: కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన స్కాలర్‌షిప్‌లను YCP అమ్మ ఒడిగా, TDP తల్లికి వందనంగా అమలు చేస్తున్నాయని అమలాపురం మాజీ MP జీవీ హర్షకుమార్ విమర్శించారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. BCల మంత్రం జపిస్తున్న YCP, TDP రెండూ ప్రైవేటు కంపెనీలేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీల వల్ల BC వర్గాలకు ఏం ప్రయోజనం చేకూరిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.