హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గన్నవరంలో మెగా రైల్ టెర్మినల్

కృష్ణా: విజయవాడ రైల్వే స్టేషన్‌పై రద్దీ, నిర్వహణ ఒత్తిడి తగ్గించేందుకు గన్నవరంలో భారీ కోచింగ్ టెర్మినల్ ఏర్పాటు కానుంది. 205 రైళ్ల రాకపోకలను నిర్వహించేలా 10 ప్లాట్‌ఫామ్‌లు, 10 లైన్లు నిర్మించనున్నారు. కోచ్ల నిర్వహణ కోసం నాలుగు పిట్ లైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టుకు 143 ఎకరాల భూమి అవసరమని రైల్వే అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.