హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణం!

VSP: కుటుంబ కలహాల నేపథ్యంలో గోరపల్లి చైతన్య (27) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వలస విశ్వనాథ్ ఎవెన్యూస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అతను మధురవాడలోని ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.