హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైపులైన్ పనులతో రోడ్డంతా గుంతలమయం

ELR: ఏలూరు నగర శివారు చాటపర్రు రోడ్డులో పంట కాలువ పూడిక తీసి పది రోజులు గడిచినా మట్టిని తొలగించలేదు. పలుచోట్ల పైపులైన్ల మరమ్మతుల కోసం భారీ గుంతలు తవ్వి పూడ్చకుండా వదిలేశారు. దీంతో రోడ్డుపై దుమ్ము, మట్టి పేరుకుపోవడంతో పాటు గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.