ELR: నిడమర్రు మండలం పెదకాపవరం పంట కాలువపై నిర్మించిన పుంత రహదారి బురదమయంగా మారింది. ఈ మార్గంలో మండలపర్రు, నిడమర్రు, ఎనికేపల్లి, బావాయి పాలెం, క్రొవ్విడి గ్రామస్థులు రాకపోకలు సాగస్తుంటారు. ప్రస్తుతం దారి ఛిద్రంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట కాలువపై రహదారి అధ్వానం


