హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల కోసం రైతుల ఎదురుచూపులు

KMM: జిల్లాలో సర్వర్ సమస్యతో ఈ-పాస్ యంత్రాలు పనిచేయక ఎరువుల కోసం రైతులు రోజంతా షాపుల ముందు ఎరుచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్, వైరా, బోనకల్లు ఏరియాల్లో పట్టాదారు పాస్ బుక్స్ లేని కౌలు రైతులు, స్మార్ట్ ఫోన్ లేని వారు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.