BDK: అశ్వాపురం మండలం మొండికుంటలో గురువారం కోడిపందాల స్థావరాలపై పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని 14 ద్విచక్ర వాహనాలు, రూ.41,820 నగదు, 8 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
తెలంగాణ
కోడిపందాల స్థావరంపై దాడి


