హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సమస్యపై స్పందించిన మంత్రి సత్యకుమార్

SS: ముదిగుబ్బ మండలంలోని వసతి గృహంలో విద్యార్థుల నీటి సమస్యపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ట్యాంకర్ల నీరు శాశ్వత పరిష్కారం కాదని భావించి RWS అధికారులతో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వసతి గృహ ప్రాంగణంలో బోర్ వేసే పనులు ప్రారంభించారు. సమస్యపై వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.