హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: అనంతగిరి మండలం, కొత్తూరు పంచాయతీ పరిధిలో అర్హులైన గిరిజనులు ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లకు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సచివాలయ డిఏ కె.ప్రేమ్ కుమార్ శుక్రవారం కోరారు. ఆధార్, కులధ్రువీకరణ, విద్యుత్ బిల్లు, ఆధార్‌కు అనుసంధాన ఫోన్ నంబర్‌తో సచివాలయానికి రావాలన్నారు. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ, వికలాంగులు సదరం సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు.