హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల

NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను కమిషనర్ చిన్న బాబు ప్రకటించారు. ప్రజలు ఓటర్లు రాజకీయ పక్షాల ప్రతినిధులు పరిశీలన కోసం పురపాలక సంఘ కార్యాలయంతో పాటు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో అందుబాటులో ఉంచామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11 తేదీలోగా లిఖితపూర్వకంగా అందజేయాలని కోరారు.