హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం అన్నప్రసాద పథకానికి విరాళం

NDL: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి గురువారం ఇద్దరు భక్తులు రూ.2 లక్షల విరాళం అందించారు. నాగర్‌కర్నూలుకు చెందిన బాలనాగయ్య, గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు చెరో రూ.లక్షను ఏఈఓ పణిధర్ ప్రసాద్‌కు అందజేశారు. దేవస్థానం అధికారులు దాతలను సత్కరించారు.