హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య చికిత్సకు రూ.1.21 లక్షల సాయం

SS: ధర్మవరం యాదవ వీధికి చెందిన వల్లంసెట్టి వెంకట్ దీక్షిత్ వైద్య చికిత్సకు ఆర్థిక సాయం కోరగా మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1,21,427 విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. తిరుపతిలోని SVIMSలో చికిత్సకు ఈ సాయం ఉపయోగపడనుంది. చికిత్స ఆగకుండా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు.