హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరమ్మత్తులు చేయరూ.. పట్టించుకోరూ..?

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని డైట్ కళాశాల ప్రహరీకి ఆనుకుని ఉన్న వీధిలో మోటారుతో పాటు నీటి ట్యాంకు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజుల క్రితం మోటారు వైరు కాలి పోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. మోటారు రిపేర్లు చేయడంతో పాటు ట్యాంకును శుభ్రం చేసి స్వచ్ఛమైన నీటిని అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.