హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జాతీయ లోక్‌ అదాలత్

KMR: జాతీయ లోక్‌ అదాలత్‌ను రేపు నిర్వహించనున్నట్లు KMR కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముక్తిదా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పాత కేసులను లోక్‌ అదాలత్ ద్వారా సత్వరమే పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. జిల్లాలో ఆరు బెంచీల ద్వారా కేసులను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి కోరారు.