హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆలయ దారిని ఆక్రమణ చేయడం తగదు'

NGKL: కొల్లాపూర్ సమీపంలోని ఈదమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే రహదారిని ఆక్రమించడం తగదని బీజేపీ నాయకులు అన్నారు. శివాలయం నుంచి చెరువు కట్ట మీదుగా ఆలయానికి వెళ్లే రహదారిని ఆక్రమించి కాంపౌండ్‌వాల్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆక్రమణలు తొలగించకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు.