ELR: ఏలూరు తపాలా శాఖ ఆధ్వర్యంలో 'దీనదయాళ్ స్వయం ఉపాధి' పథకం ద్వారా 2026 - 27 విద్యా సంవత్సరంలో 6– 9వ తరగతి వరకు 60 శాతం మార్కులు సాధించిన అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6వేలు అందజేస్తామని పేర్కొన్నారు. అర్హులు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తపాలా ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం


