హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'1980's ఫొటో ట్రెండ్‌పై జాగ్రత్తగా ఉండాలి'

KKD: 1980ల ఫొటో ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు నకిలీ యాప్‌లు, అనుమానాస్పద లింకులను ప్రచారం చేస్తున్నారని తుని సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. '1980s' పేరుతో ఏపీకే ఫైల్స్, లింకులు పంపుతూ నెటిజన్లను మోసం చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ట్రెండ్ కోసం తెలియని యాప్లను డౌన్లోడ్ చేయవద్దని,అధికారిక యాప్ స్టోర్ల నుంచే వినియోగించాలని సూచించారు.