హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అలంకరణలో దుర్గ అమ్మవారు

SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని అనేక రంగుల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.