ప్రకాశం: పోలీస్‌శాఖలో ఖాళీగా ఉన్న 20వేల పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రంగరాయుడు చెరువు జంక్షన్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. శీలం ప్రేమ్‌కుమార్, జి. ఏడుకొండలు, శ్రీను, వాసు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి'


