హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు: DSP

E.G: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య సూచించారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ మహిళా పోలీస్ సిబ్బందితో ఇప్పన పాడు పోలీస్ స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రూరల్ సీఐ దొరరాజు పాల్గొన్నారు.