హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి 16.189 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 138 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 1050 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.