హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొంగళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: వేటపాలెం మండలం పాపాయిపాలెం గ్రామంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గోర్ల వారి పొంగళ్లు మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొండయ్యకు ఘనంగా స్వాగతం పలికారు.