హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

QVSE యాప్‌పై ప్రజలకు ఎస్పీ హెచ్చరికలు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా QVSE యాప్ ద్వారా పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. నెలకు అధిక వడ్డీ,రోజువారీ చెల్లింపులు, డాలర్లలో పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ వంటి ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను నమ్మిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి చైన్-లింక్ స్కామ్లను నమ్మి డబ్బులు పెట్టవద్దని హెచ్చరించారు.