హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహం.. 8 మందిపై కేసు

WG: మొగల్తూరులో12 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంప గ్రామంలో ఆగస్టు 22న రాత్రి బాల్య వివాహం జరిగినట్లు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందింది. విచారణలో 28 ఏళ్ల యువకుడు బాలికను వివాహం చేసుకున్నట్లు తేలింది. వివాహానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిపై బాల్య వివాహ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు.