KDP: ఒంటిమిట్ట కోదండరామాలయంలో పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక యాగశాలను సిద్ధం చేసి, హోమగుండాలను నిర్మించారు. ఆలయంలో నిత్య పూజలు, కైంకర్యాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాల నివారణకు శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తితిదే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటిమిట్టలో నేడు పవిత్రోత్సవాలకు అంకురార్పణ


