KKD: ప్రత్తిపాడు(M) ధారపల్లి సమీప అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంపై DyCM పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. పులి జనావాసాల్లోకి రాకుండా అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, రాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పులి సంచారంపై నిరంతర నిఘా ఉంచాలి: పవన్


