హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం

BPT: యద్దనపూడిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్‌లలో బాల్యవివాహాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఐసీపీఎస్ కౌన్సిలర్ రేణుక మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన చర్యలను వివరించారు. సోషల్ వర్కర్ డి.రాము విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.