హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్..!

BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శుక్రవారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్, పెన్షన్ల దరఖాస్తులపై సదస్సు నిర్వహిస్తారు. అనంతరం 3వ వార్డు శాంతినగర్‌లో రూ.15 లక్షలతో డ్రైనేజీ పనులు, 31వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 79.13 లక్షలతో రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించనున్నారు.