KDP: ప్రొద్దుటూరు 2-టౌన్ ఎస్సై రాఘవేంద్రరెడ్డి గురువారం గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలతో సమావేశమయ్యారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు రాత్రివేళల్లో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'


