హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ సిబ్బందిపై దాడి.. రెండేళ్ల జైలు

E.G: ఎక్సైజ్ పోలీసులపై దాడికి యత్నించిన కేసులో గుమ్మడి సతీశ్(38)కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. రాజమండ్రి లో 2021 ఏప్రిల్ 22న సతీశ్ ఇంటి వద్ద ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలకు వెళ్లగా, అతని భార్య నాటుసారాతో పట్టుబడింది. ఈ సమయంలో సతీష్ కర్ర, ఖాళీ బీర్ బాటిల్‌తో సిబ్బందిపై దాడికి యత్నించి విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదైంది.