హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ సుందరీకరణకు చర్యలు: కమిషనర్

KKD: నగరంలోని ప్రధాన జంక్షన్లను ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అనువుగా తీర్చిదిద్దడంతో పాటు సుందరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ బృందం గురువారం నగరంలో పర్యటించింది.15 ప్రధాన జంక్షన్లను పరిశీలించి అభివృద్ధి విధానాలపై బృందం అధ్యయనం చేయనుంది.