హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువజనోత్సవాల పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: జిల్లా స్థాయి యువజనోత్సవాల పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువత ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. జానపద నృత్యం, జానపద గీతాలు,పెయింటింగ్, వీధి నాటకం, కథా రచన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈనెల 17లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.