హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

E.G: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద అర్హులైన పేదలు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కోరారు. దరఖాస్తుల స్వీకరణకు శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు అన్ని వార్డు సచివాలయాలు తెరిచి ఉంటాయని తెలిపారు. అర్హులు తమ వార్డు సచివాలయాలను సంప్రదించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.