KRNL: భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన పెద్దకడబూరు మం. హనుమాపురం గ్రామానికి చెందిన శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 8న అత్తగారింటి వద్ద పురుగు మందు తాగగా కుటుంబసభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 9న మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారుతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భార్య కాపురానికి రాలేదని భర్త సూసైడ్!


